Vice President Election 2022: ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల, ఆగ‌స్టు 6వ తేదీన పోలింగ్, జులై 19 వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు

ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌లైంది. జులై 5వ తేదీన ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ వెలువ‌డనుంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 6వ తేదీన ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

Vice President M Venkaiah Naidu. (Photo Credits: Twitter@VPSecretariat)

ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌లైంది. జులై 5వ తేదీన ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ వెలువ‌డనుంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 6వ తేదీన ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు ఫ‌లితాల‌ను కూడా వెల్ల‌డించ‌నున్నారు. జులై 19 వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు విధించారు. 20 నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు జులై 22 తుది గ‌డువు. ప్ర‌స్తుతం ఉప రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య‌నాయుడు కొన‌సాగుతోన్న విష‌యం విదిత‌మే. వెంకయ్యనాయుడు 2017 ఆగస్టు 11వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement