Video: వీడియో ఇదిగో, బైకును, రోడ్డుపై విద్యార్థునులను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన కారు, గాల్లోకి ఎగిరి రోడ్డుపై విద్యార్థులు

కర్ణాటకలో అతివేగంగా వెళ్తున్న కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టిన ఘోర రోడ్డు ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జూలై 18న రాయచూర్‌లోని శ్రీరామ దేవాలయం సమీపంలో జరిగినట్లు సమాచారం.

Karnataka Hit-And-Run, Car Ploughs Into Biker, Students

కర్ణాటకలో అతివేగంగా వెళ్తున్న కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను ఢీకొట్టిన ఘోర రోడ్డు ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జూలై 18న రాయచూర్‌లోని శ్రీరామ దేవాలయం సమీపంలో జరిగినట్లు సమాచారం. నిమిషానికి పైగా నిడివి ఉన్న సీసీటీవీ ఫుటేజీలో కాలేజీ అమ్మాయిలు వాహనాలు వెళుతుండగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు.

కారు దూసుకువచ్చి బైక్‌ను ఢీ కొట్టి అనంతరం పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు కాలేజీ అమ్మాయిలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సహా విద్యార్థులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇంత ప్రమాదం జరిగినా కారు నడుపుతున్న వ్యక్తి కనీసం వారికి ఏమైందని కూడా చూడకుండా వేగంగా కారు నడుపుకుంటా వెళ్లిపోయాడు.ఇందుకు సంబంధించిన సీసీటీవీలో రికార్డ్‌ కాగా.. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై రాయచూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Karnataka Hit-And-Run, Car Ploughs Into Biker, Students

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement