Rahul Gandhi on Marriage: వీడియో ఇదే, సరైన అమ్మాయి దొరికితేనే పెళ్ళి చేసుకుంటా, పెళ్లి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
యూట్యూబ్ ఛానల్‌కు చెందిన యాంకర్ కమియా జాని మీరు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడగగా సరైన అమ్మాయి దొరికితే.. పెళ్లి చేసుకుంటానని బదులిచ్చారు.
కర్లీ టెయిల్స్ డిజిటల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూట్యూబ్ ఛానల్‌కు చెందిన యాంకర్ కమియా జాని మీరు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడగగా సరైన అమ్మాయి దొరికితే.. పెళ్లి చేసుకుంటానని బదులిచ్చారు. దానికి ఏమైనా చెక్‌లిస్టు ఉందా అని ఆ యాంకర్ మరో ప్రశ్న వేసింది. అదేమీ లేదు, ప్రేమించే వ్యక్తి బెటర్ అని, ఆమె ఇంటలిజెంట్ అయితే చాలు అన్నట్లు రాహుల్ తెలిపారు.మీ మెసేజ్ అమ్మాయిలకు చేరుతుందని ఆమె పేర్కొన్నది. అయితే మీరు నన్ను ఇబ్బందుల్లో పడేస్తున్నారని రాహుల్ నవ్వుతూ కామెంట్ చేశారు. తాను పెళ్లాడబోయే వ్యక్తి తన తల్లి లాంటి గుణాలు కలిగి ఉండాలని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ పేర్కొన్న విషయం తెలిసిందే.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)