Vikarabad Food Poisoning: తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 30 మంద విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు హాస్టల్‌లో వండిన ఆహారం తిని 30మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు హాస్టల్‌లో వండిన ఆహారం తిని 30మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన విద్యార్థినులను తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా వసతిగృహంలో అందిస్తున్న భోజనం నాణ్యత సరిగా లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక ఇటీవలే నారాయణపేట జిల్లా పరిధిలోని మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం విదితమే.
వీడియో ఇదిగో, అప్పుల భాదతో కుటుంబం ఆత్మహత్యాయత్నం, ఆన్ లైన్ షేర్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టి లాస్
Vikarabad Food Poisoning:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)