Vivek Phansalkar: ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌గా వివేక్ ఫ‌ణ్‌షాల్క‌ర్, నేడు పదవీ విరమణ చేయనున్న సంజ‌య్ పాండే, ఉత్తర్వులు జారీచేసిన మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం కొనసాగుతున్న స‌మ‌యంలోనే ఆ రాష్ట్ర రాజ‌ధాని ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ మార్పు అనివార్యమైంది. ప్ర‌స్తుతం ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంజ‌య్ పాండే గురువారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

New Mumbai Police Commissioner Vivek Phansalkar (Photo Credits: Twitter@7_ganesh)

మహారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం కొనసాగుతున్న స‌మ‌యంలోనే ఆ రాష్ట్ర రాజ‌ధాని ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ మార్పు అనివార్యమైంది. ప్ర‌స్తుతం ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంజ‌య్ పాండే గురువారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న స్థానంలో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి వివేక్ ఫ‌ణ్‌షాల్క‌ర్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు మ‌హారాష్ట్ర ప్రభుత్వం బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గురువారం సంజ‌య్ పాండే నుంచి వివేక్ ఫ‌ణ్‌షాల్క‌ర్ ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వివేక్ ఫ‌ణ్‌షాల్క‌ర్‌... మ‌హా‌రాష్ట్రలోని అకోలా ఏఎస్పీగా త‌న కెరీర్‌ను ప్రారంభించారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్రలోని థానే న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ఆయ‌న‌ ప‌నిచేస్తున్నారు. 2018 నుంచి ఆయ‌న అదే పోస్టులో కొన‌సాగుతున్నారు. అంత‌కుముందు ముంబై అవినీతి నిరోధ‌క శాఖ చీఫ్‌గానూ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement