Republic Day 2024: అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, దేశవ్యాప్తంగా ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు, వీడియో ఇదిగో..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.

PM Modi pays tributes to martyrs at the National War Memorial in Delhi on the occasion of Republic Day

దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘75వ గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సందర్భంలో శుభాకాంక్షలు. జై హింద్!’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. ఇక ఇమాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క 'విక్షిత్ భారత్', 'భారత్: ప్రజాస్వామ్యానికి మాతృక' అనే థీమ్‌తో ఈ ఏడాది వేడుకలు జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)