Wayanad Landslide: వయనాడ్ మృత్యుఘోష, 63కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా శిథిలాల కింద వందలాది మంది బాధితులు, కొనసాగుతున్న సహాయక చర్యలు

కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో భారీగా కొండ‌చ‌రియ‌లు(Wayanad Landslides) విరిగిప‌డ్డాయి. భారీ వర్షాలకు తీవ్ర‌మైన వ‌ర‌ద తోడు కావడంతో మ‌ట్టిచ‌రియ‌లు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 63కు పెరిగింది.మెప్ప‌డి, ముంద‌క్కాయి ప‌ట్ట‌ణం, చూర‌ల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జ‌రిగింది.

Wayanad landslide: Death toll rises to 63, a total of 116 injuries reported so far: Kerala Revenue Minister's office

కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో భారీగా కొండ‌చ‌రియ‌లు(Wayanad Landslides) విరిగిప‌డ్డాయి. భారీ వర్షాలకు తీవ్ర‌మైన వ‌ర‌ద తోడు కావడంతో మ‌ట్టిచ‌రియ‌లు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 63కు పెరిగింది.మెప్ప‌డి, ముంద‌క్కాయి ప‌ట్ట‌ణం, చూర‌ల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జ‌రిగింది. తొలుత రాత్రి ఒంటి గంట‌కు ముంద‌క్కాయి ప‌ట్ట‌ణంలో వ‌ర్షం వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. అక్క‌డ రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే.. చూర‌ల్‌మాలాలో తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు మ‌ట్టిచ‌రియ‌లు విరిగిపడ్డాయి. క్యాంపుగా మారిన స్కూల్‌తో పాటు స‌మీప ఇండ్ల‌లోకి నీరు ప్ర‌వేశించింది. వ‌ర‌ద నీరు, బుర‌ద‌తో నిండిపోయాయి.  వయనాడ్ ప్రళయంలో కేరళకు అండగా తమిళనాడు సీఎం స్టాలిన్, తక్షణ సాయం కింద రూ. 5 కోట్లు విడుదల చేయాలని ఆదేశాలు

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement