SC on Pregnancy Termination: 26 వారాల గర్భ విచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపాలనుకుంటున్నారా అంటూ సూటి ప్రశ్న
తన 26 వారాల గర్భాన్ని (Termination of 26 week pregnancy) విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతినివ్వాలంటూ ఓ మహిళ చేసిన అభ్యర్థనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ (Chief Justice DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
తన 26 వారాల గర్భాన్ని (Termination of 26 week pregnancy) విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతినివ్వాలంటూ ఓ మహిళ చేసిన అభ్యర్థనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ (Chief Justice DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారా? అని సీజేఐ (CJI) ప్రశ్నించారు. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని తాము చంపలేమని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనని ఆమె న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తి చేసుకునేందుకు అక్టోబరు 9న ఆమెకు అనుమతినిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. తాజా విచారణలో ఆ బిడ్డను మేం చంపలేం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.మరికొన్ని వారాలు బిడ్డను మోసే బాధ్యత గురించి ఆ మహిళతో మాట్లాడాలని కేంద్రం, పిటిషనర్ తరఫు న్యాయవాదులకు సూచించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారం ఉదయానికి వాయిదా వేసింది.
Here's PTI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)