CM Mamata Banerjee: పానీపూరి అమ్మిన సీఎం మమతా బెనర్జీ, సీఎం స్పెషల్ పానీ పూరీ కోసం ఎగబడిన పిల్లలు, పెద్దలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ డార్జిలింగ్ లో పర్యటించారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆమె ఈ హిల్ స్టేషన్ కు వచ్చారు. మమతా బెనర్జీ పర్యటన మూడ్రోజుల పాటు కొనసాగనుంది
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ డార్జిలింగ్ లో పర్యటించారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆమె ఈ హిల్ స్టేషన్ కు వచ్చారు. మమతా బెనర్జీ పర్యటన మూడ్రోజుల పాటు కొనసాగనుంది. కాగా, తన పర్యటనలో భాగంగా డార్జిలింగ్ లోని మాల్ రోడ్ లో ఉన్న పానీ పూరీ దుకాణాన్ని సందర్శించారు. కస్టమర్లకు తానే స్వయంగా పానీ పూరీ విక్రయించారు. దాంతో సీఎం స్పెషల్ పానీ పూరీ కోసం పిల్లలు, పెద్దలు ఎగబడ్డారు. మమతా పానీ పూరీ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)