Subrata Mukherjee Dies: పశ్చిమబెంగాల్‌ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత, సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ముఖర్జీ మరణం తమకు తీరని లోటని ఆవేదన

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎస్‌ఎస్‌కేఎం ఆ‍స్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు.

Subrata Mukherjee (Photo Credits: Facebook)

తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి సుబ్రతా ముఖర్జీ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎస్‌ఎస్‌కేఎం ఆ‍స్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. వారం రోజుల క్రితం శ్వాస సంబంధమైన సమస్య తలెత్తడంతో ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణవార్త విన్న వెంటనే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మమత మంత్రి వర్గంలో ఆయన కీలక మంత్రిగా పనిచేశారు. పంచాయతీరాజ్‌ శాఖ సహా పలు ఇతర శాఖలను బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఆయన మరణం పట్ల మమత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముఖర్జీ మరణం తమకు తీరని లోటని మమతా బెనర్జీ అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)