Workplace Violence: వీడియో ఇదిగో, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఉద్యోగిని కత్తితో నరికిన సహోద్యోగి, అందరూ చూస్తుండగానే కిరాతకంగా..
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యెరవాడలోని బీపీవో సంస్థలో పని చేస్తున్న మహిళ తన సహెద్యోగి నుంచి అప్పుగా డబ్బు తీసుకున్నది. తిరిగి చెల్లించకపోవడంపై అతడు ఆగ్రహించి జనం చూస్తుండగా కత్తితో దాడి చేసి నరికాడు.
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యెరవాడలోని బీపీవో సంస్థలో పని చేస్తున్న మహిళ తన సహెద్యోగి నుంచి అప్పుగా డబ్బు తీసుకున్నది. తిరిగి చెల్లించకపోవడంపై అతడు ఆగ్రహించి జనం చూస్తుండగా కత్తితో దాడి చేసి నరికాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యెరవాడలోని బీపీవో సంస్థలో 28 ఏళ్ల శుభద శంకర్ కొడారే నాలుగేళ్లుగా పని చేస్తున్నది.
తండ్రికి వైద్యం కోసం నాలుగు లక్షలు అప్పుగా సహోద్యోగి కృష్ణ నుంచి ఆమె తీసుకుంది. డబ్బు తిరిగి ఇవ్వాలని కృష్ణ అడిగినా ఆమె చెల్లించకపోవడంతో సహోద్యోగి అయిన 30 ఏళ్ల కృష్ణ సత్యనారాయణ కనోజా కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆ సంస్థ పార్కింగ్ ఏరియాలో అంతా చూస్తుండగా కత్తితో శుభద చేతిని నరికాడు. కృష్ణ చేతిలోని కత్తి చూసి అక్కడున్న వారు ఆ మహిళను కాపాడేందుకు సాహసించలేదు. కొందరు వ్యక్తులు రాళ్లతో అతడిపై దాడి చేసేందుకు ముందుకు వచ్చారు. ఇది చూసి తన చేతిలోని కత్తిని అతడు కింద పడేశాడు. దీంతో వారు కృష్ణను పట్టుకుని కొట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు అతడ్ని అప్పగించారు.నిందితుడ్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Man Kills Colleague With Chopper Over Monetary Dispute
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)