Wrestlers Protest: కొత్త మలుపు తిరిగిన బ్రిజ్ భూష‌ణ్ కేసు, మైన‌ర్‌ను వేధించిన‌ట్లు ఆధారాలు లేవని తెలిపిన ఢిల్లీ పోలీసులు, ఎఫ్ఐఆర్‌ ర‌ద్దు చేయాల‌ని రిపోర్టు

బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు కొత్త మలుపు తిరిగింది. మైన‌ర్‌ను లైంగికంగా వేధించిన‌ట్లు బ్రిజ్ భూష‌ణ్‌పై స్టార్ రెజ్ల‌ర్లు ఆరోపిస్తూ.. ఫిర్యాదు చేశారు. ఆ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టిన‌ ఢిల్లీ పోలీసులు మైన‌ర్‌ను బ్రిజ్ వేధించిన‌ట్లు ఆధారాలు లేవ‌ని త‌మ ఛార్జిషీట్‌లో తెలిపారు.

Brijbhushan-Sharan-Singh (Photo-ANI)

బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు కొత్త మలుపు తిరిగింది. మైన‌ర్‌ను లైంగికంగా వేధించిన‌ట్లు బ్రిజ్ భూష‌ణ్‌పై స్టార్ రెజ్ల‌ర్లు ఆరోపిస్తూ.. ఫిర్యాదు చేశారు. ఆ ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టిన‌ ఢిల్లీ పోలీసులు మైన‌ర్‌ను బ్రిజ్ వేధించిన‌ట్లు ఆధారాలు లేవ‌ని త‌మ ఛార్జిషీట్‌లో తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు రిపోర్టు ఇచ్చారు. బ్రిజ్‌పై మైన‌ర్ దాఖ‌లు చేసిన ఎఫ్ఐఆర్‌ను ర‌ద్దు చేయాల‌ని పోలీసులు త‌మ రిపోర్టులో కోరారు.

మైన‌ర్ కేసు విష‌యంలో పోలీసులు సుమారు 500 పేజీల నివేదిక‌ను పొందుప‌రిచారు. విచార‌ణ‌లో త‌మ‌కు ఎటువంటి ఆధారాలు ల‌భించ‌లేద‌న్నారు. మైన‌ర్ కేసు విష‌యంలో సీఆర్పీసీ సెక్ష‌న్ 173 కింద రిపోర్టును రూపొందించిన‌ట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.. బాధిత మైన‌ర్ తో పాటు ఆమె తండ్రి నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్న‌ట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, మైన‌ర్ కేసు విషయంలో జులై 4న కోర్టు విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

PTI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Hyderabad: జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ట్రాక్ మీద రెండు ముక్కలుగా శరీరీం, మృతురాలిని భార్గవిగా గుర్తించిన పోలీసులు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు

Donald Trump on BRICS Nations: బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, అమెరికా డాలర్‌కు నష్టం కలిగించే ఏ దేశానికైనా 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక

Trump Says Putin 'Destroying Russia': సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు, తొలి రోజే మిత్రుడికి షాకిచ్చిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్

Share Now