Zain Nadella Dies: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతి, ఉద్యోగులకు మెయిల్ పెట్టిన కంపెనీ యాజమాన్యం

Zain-Nadella

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్(26) కన్నుమూశారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ తెలిపింది. అతని వయస్సు 26 సంవత్సరాలు. అతను సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. జైన్ మరణించినట్లు సాఫ్ట్‌వేర్ తయారీదారు తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఇమెయిల్‌లో తెలిపారు. వారి కుటుంబాన్ని తగిన శక్తిని ఇచ్చేలా భగవంతున్ని ప్రార్థించాలని ఈమెయిల్ సందేశంలో కంపెనీ తెలిపింది.

సెరిబ్రల్ పాల్సీ అంటే.. పుట్టుకతోనే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. దీనితో బ్రెయిన్‌కు కాళ్లు, చేతులపై కంట్రోల్ ఉండదు. అంటే నడవలేరు. వీల్ చైర్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. కాగా సత్యనాదెళ్లకు కుమారుడితోపాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.

కాగా సత్య నాళ్ల 2014లో సీఈవో బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి వైకల్యం కలిగిన ఉత్పత్తికి మెరుగైన సేవలను రూపొందించారు. జైన్‌ నాదెళ్ల నుంచి తాను నేర్చుకున్న పాఠాలను ఇందుకు ఉదాహరించారు. జైన్ నాదెళ్ల ఎక్కువగా చైల్డ్‌రన్స్ హాస్పిటల్ అయిన సీటెల్ చైల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్‌లో ఎక్కువగా చికిత్స పొందారు. ఈ హాస్పిటల్ పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్‌లో జైన్ నాదెల్లా ఎండోడ్ చైర్‌ను స్థాపించడానికి నాదెళ్లతో గత ఏడాది చేతులు కలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)