Zomato CEO Deepinder Goyal: డెలివ‌రీ బాయ్‌గా వెళ్లిన జొమాటో సీఈఓకు చేదు అనుభవం, మెట్ల మార్గంలోనే మూడో అంత‌స్తుకు వెళ్లి ఆర్డ‌ర్..

జొమాటో డెలివ‌రీ బాయ్స్ విధుల్లో ఉండ‌గా ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునేందుకు సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ డెలివ‌రీ బాయ్‌గా వెళ్లారు. అయితే ఓ మాల్‌లో ఆర్డ‌ర్‌ను క‌లెక్ట్ చేసుకునే క్ర‌మంలో ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. అక్క‌డి సెక్యూరిటీ సిబ్బంది దీపింద‌ర్‌ను లిఫ్ట్‌లోకి ఎక్క‌కుండా అడ్డుకున్నారు.

Zomato CEO Deepinder Goyal at Ambience Mall in Gurugram (Photo Credits: X/@deepigoyal)

జొమాటో డెలివ‌రీ బాయ్స్ విధుల్లో ఉండ‌గా ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునేందుకు సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ డెలివ‌రీ బాయ్‌గా వెళ్లారు. అయితే ఓ మాల్‌లో ఆర్డ‌ర్‌ను క‌లెక్ట్ చేసుకునే క్ర‌మంలో ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. అక్క‌డి సెక్యూరిటీ సిబ్బంది దీపింద‌ర్‌ను లిఫ్ట్‌లోకి ఎక్క‌కుండా అడ్డుకున్నారు. దాంతో చేసేదేమిలేక మెట్ల మార్గంలోనే మూడో అంత‌స్తుకు వెళ్లి ఆర్డ‌ర్ తీసుకున్న‌ట్లు త‌న‌కు ఎదురైన షాకింగ్‌ అనుభ‌వాన్ని తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఆయ‌న‌ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక పోస్టు పెట్టారు. ఈ సంఘ‌ట‌న‌తో డెలివ‌రీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా మాల్స్‌తో క‌లిసి జొమాటో మ‌రింత సాన్నిహిత్యంగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విషయం త‌న‌కు బోధ‌ప‌డింద‌ని అన్నారు. దీనిపై  మీ అభిప్రాయాన్ని తెలియ‌జేయం‌డంటూ నెటిజ‌న్లను కోరారు.

జొమాటో ఉద్యోగుల‌కు నిజంగా పండుగే! ఏకంగా 1.2 కోట్ల షేర్ల‌ను ఎంప్లాయిస్ కు ఇస్తూ నిర్ణ‌యం, ఎవ‌రెవ‌రికి ద‌క్కుతాయంటే?

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement