Aditya Thackeray: వీడియో ఇదిగో, బీజేపీ చేతుల్లో పడ్డారు మీ పని అస్సామే ఇక, టీడీపీ, జేడీయూలకు ఆదిత్య ఠాక్రే హెచ్చరిక, స్పీకర్ పోస్ట్ డిమాండ్ చేయాలని సూచన

‘టీడీపీ, జేడీ(యూ) పార్టీలు.. తమ పార్టీను రక్షించుకోవాలి. అందుకోసం బీజేపీ నుంచి లోక్‌సభ స్పీకర్‌ పదవి డిమాండ్‌ చేసి తీసుకోండి. లేదంటే త్వరలోనే మీ పార్టీలను బీజేపీ చీల్చివేస్తుంది’ అని ఆదిత్య ఠాక్రే ‘ఎక్స్‌​’ వేదికగా అన్నారు.

Aditya Thackeray

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించలేకపోయిన సంగతి విదితమే. దీంతో కేంద్రంలో భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి తెలుగుదేశం(టీడీపీ), జేడీ (యూ)లు కీలకంగా వ్యవహరించి మద్దతు పలికాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీ(యూ) భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలని శివసేన (యూబీటీ) వర్గం నేత ఆదిత్య ఠాక్రే హెచ్చరించారు. ‘టీడీపీ, జేడీ(యూ) పార్టీలు.. తమ పార్టీను రక్షించుకోవాలి. అందుకోసం బీజేపీ నుంచి లోక్‌సభ స్పీకర్‌ పదవి డిమాండ్‌ చేసి తీసుకోండి. లేదంటే త్వరలోనే మీ పార్టీలను బీజేపీ చీల్చివేస్తుంది’ అని ఆదిత్య ఠాక్రే ‘ఎక్స్‌​’ వేదికగా అన్నారు.  రేపు 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, విజయవాడ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు, 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిన విధానాన్ని ఆదిత్య పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్డీయే కూటమి ఇంకా లోక్‌సభ స్పీకర్‌ పదవిని ఎవరికీ కేటాయించలేదు. భాగస్వామ్య పార్టీలు స్పీకర్‌ పదవిని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే వారి డిమాండ్‌కు బీజేపీ ఒప్పుకోవటం లేదని ఎన్డీయే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Here's Tweet and Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)