Chandrababu (Photo0TDP/X)

Vjy, June 11: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. కేసరపల్లిలోని ఐటీటవర్‌ వద్ద బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు విచ్చేస్తుండటంతో దాదాపు ఏడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. టీడీపీ అధినేత... రేపు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రుల కూర్పునకు సంబంధించి గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. ఉదయం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై... శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను కూటమి నేతలు గవర్నర్‌కు అందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్... చంద్రబాబును ఆహ్వానించారు.  మూడు రాజధానులకి పుల్‌స్టాప్ పెట్టిన చంద్రబాబు, ఏపీ రాజధానిగా అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం

చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టనున్నారు. పాస్‌లు ఉన్న వారి వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. నగరంలో వీఐపీలు బసచేసే హోటల్స్‌ వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్‌ జిల్లా సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు.. కార్యకర్తలు విజయవాడ చేరుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈరోజు రాత్రికే విజయవాడ చేరుకోనున్నారు.  ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై బాబు సర్కార్ ఫోకస్.. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానాలపై ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారుల బృందం అధ్యయనం.. చివరకు తెలంగాణ ‘ఫ్రీ బస్సు’ మోడల్ కు సై!

గన్నవరం విమానాశ్రయ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బుధవారం విమాన ప్రయాణికులు ఉదయం 9.30 గంటల్లోపే చేరుకోవాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంత రెడ్డి సూచించారు. ప్రయాణికుల విమానాలేవీ రద్దు చేయలేదని.. అన్నీ యథాతథంగా నడుస్తాయని తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, తిరుపతి, షిర్డీ వెళ్లే విమానాలు యధావిధిగా బయల్దేరతాయని చెప్పారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమానాశ్రయ పరిసరాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

విజయవాడ నగరంలో సాధారణ వాహనాలు..

👉 విజయవాడ నుంచి ఏలూరు, విశాఖపట్నం వైపు వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బెంజ్‌ సర్కిల్‌ నుంచి కంకిపాడు–పామర్రు–హనుమాన్‌ జంక్షన్‌–ఏలూరు వైపు వెళ్లాల్సి ఉంటుంది.

విజయవాడ వెలుపల ట్రాన్స్‌పోర్టు వాహనాలు..

👉 విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వైపు వచ్చు వాహనాలు.. హనుమాన్‌ జంక్షన్‌ వద్ద నుంచి నూజివీడు, జి. కొండూరు, ఇబ్రహింపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అటు నుంచే వాహనాలు కూడా అదే మార్గం గుండా రావాలి.

👉 విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లు వాహనాలు.. హనుమాన్‌ జంక్షన్‌ వద్ద నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుముడి వారధి రేపల్లె, బాపట్ల, త్రోవగుంట ఒంగోలు మీదుగా వెళ్లాలి.

👉 చెన్నై నుంచి విశాఖపట్నం వైపునకు వచ్చే వాహనాలు.. ఒంగోలు, త్రోవగుంట, బాపట్ల, రేపల్లె, పెనుముడి వారధి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లాలి.

👉 చెన్నై నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు.. మేదరపెట్ల, అద్దంకి, నరసరావుపేట, పిడుగురాళ్ల, మిర్యాలగూడెం, నల్గొండ నుంచి వెళ్లాలి.

👉 హైదరాబాద్‌ నుంచి గుంటూరు వైపు వచ్చే వాహనాలు.. నల్గొండ, మిర్యాలగూడెం, దాచేపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట, అద్దంకి, మేదరమెట్ల నుంచి వెళ్లాలి

ఆర్టీసీ బస్సుల మళ్లింపు ఇలా..

👉 విజయవాడ ఏలూరు వైపు వెళ్లు బస్సులు.. పీఎన్‌బీఎస్‌ నుంచి ఓల్డ్‌ పీసీఆర్‌ జంక్షన్, ఏలూరు రోడ్, హోటల్‌ స్వర్ణ పాలెస్, చుట్టుగుంట, గుణదల, రామవరప్పాడు రింగ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్, నున్న బైపాస్, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్, ఏలూరు వైపు వెళ్లాలి.

👉 విజయవాడ రామవరప్పాడు రింగ్‌ నుంచి గన్నవరం వైపు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్లే వాహనాలు, అంబులెన్స్, అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనాల తప్ప ఏ ఇతరవాహనాలు గన్నవరం వైపు అనుమతించరు. పాసులు ఉన్న వాహనాలను మాత్రమే అనుమిస్తారు. ట్రాఫిక్‌ మళ్లింపులను గమనించి నగర ప్రజలంతా సహకరించాలని సీపీ రామకృష్ణ కోరారు.