Modi Surname Remark Case: గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్‌ గాంధీ, పరువు నష్టం కేసులో స్టే పిటిషన్‌ను తిరస్కరించిన సూరత్‌ సెషన్స్‌ కోర్టు

మోదీ ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) గుజరాత్‌ హైకోర్టును (Gujarat HighCourt) ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షను నిలిపేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను సూరత్‌ సెషన్స్‌ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన తాజాగా గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘

Congress Leader Rahul Gandhi (Photo Credit: ANI)

మోదీ ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) గుజరాత్‌ హైకోర్టును (Gujarat HighCourt) ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షను నిలిపేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను సూరత్‌ సెషన్స్‌ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన తాజాగా గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

‘మోదీ’ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్‌ కోర్టు.. రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ గతంలో తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. 2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ ‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరే ఎందుకు ఉంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేయడంతో ఈ కేసు వ్యవహారం మొదలైంది

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now