Delhi Excise Policy Case: వరుసగా నాలుగోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ డుమ్మా, ఎన్నికలలోపే ఈడీ తనను అరెస్టు చేయాలని చూస్తోందని ఆరోపణలు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వరుసగా నాలుగోసారి గైర్హాజరయ్యారు.గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా కేజజ్రీవాల్‌ వెళ్లలేదు. ఈడీ నోటీసులపై ఆయన స్పందించారు.

Delhi CM Arvind Kejriwal (Photo Credit: ANI)

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వరుసగా నాలుగోసారి గైర్హాజరయ్యారు.గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా కేజజ్రీవాల్‌ వెళ్లలేదు. ఈడీ నోటీసులపై ఆయన స్పందించారు. ఈడీ తనకు సమన్లు పంపడం చెల్లదని, అవి పూర్తిగా చట్ట విరుద్ధమని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా ఆపడానికే బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికలలోపే ఈడీ తనను అరెస్టు చేయాలని చూస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈడీ నోటీసులన్నీ రాజకీయ కక్ష్యలో భాగమేనని, ఇలాంటి నోటీసులన్నింటినీ కోర్టు ఎప్పటికప్పుడు కొట్టివేస్తూ వస్తోందని కేజ్రీవాల్‌ గుర్తు చేశారు.

Here' s Delhi CM Reaction on ED notice

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement