Delhi Mayor Elections:రసాభాసగా మారిన ఢిల్లీ మేయర్ ఎన్నిక, ఆప్‌-బీజేపీ సభ్యుల మధ్య తోపులాట, మేయర్‌ పదవిని తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా

నామినేటెడ్‌ కౌన్సిలర్‌లు ప్రమాణం చేసే సమయంలో ఆప్‌, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో సంయమనం పాటించాలని ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్య శర్మ(బీజేపీ) తోటి సభ్యులకు పిలుపు ఇచ్చారు.

Huge ruckus at Civic Centre (Photo-ANI)

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మేయర్‌ ఎన్నికకు ముందర రసాభాస చోటు చేసుకుంది. నామినేటెడ్‌ కౌన్సిలర్‌లు ప్రమాణం చేసే సమయంలో ఆప్‌, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో సంయమనం పాటించాలని ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్య శర్మ(బీజేపీ) తోటి సభ్యులకు పిలుపు ఇచ్చారు. ఎంసీడీకి జరిగిన ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించింది. ఓటమిపాలైనప్పటికీ.. మేయర్‌ పదవిని తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆప్‌ తరపున షెల్లీ ఒబెరాయ్‌ పోటీపడుతుండగా, బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. మరోవైపు బ్యాకప్ అభ్యర్థిగా అషు థాకూర్‌ను ఆప్‌ నిలబెట్టనుంది.

Here's ANI Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)