Exit Poll 2024: ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌‌లో పాల్గొనడం లేదు, చరిత్రలో తొలిసారిగా సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ

లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) రేపటితో ముగియనున్నాయి. జూన్ 1వ తేదీన జరిగే ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియగానే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలపై పడనుంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 'ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌'లో తమ పార్టీ పాల్గొనేది లేదని శుక్రవారంనాడు ప్రకటించింది.

Pawan-Khera (photo-ANI)

లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) రేపటితో ముగియనున్నాయి. జూన్ 1వ తేదీన జరిగే ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియగానే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలపై పడనుంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 'ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌'లో తమ పార్టీ పాల్గొనేది లేదని శుక్రవారంనాడు ప్రకటించింది.  జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు, ఈసీ ట్వీట్ ఇదిగో..

జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడడానికి ముందే ఎలాంటి ఊహాగానాలకు, వాదోపవాదాలకు తావీయరాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా (Pawan Khera) తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొనడం లేదు. 4వ తేదీ నుంచి ఏ డిబేట్‌లో పాల్గొనేందుకైనా మేము సిద్ధం'' అని పవన్ ఖేరా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.కాగా ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌కు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now