Exit Poll 2024: కాంగ్రెస్ పార్టీ యూ టర్న్, అన్ని పార్టీలు నేటి ‘ఎగ్జిట్ పోల్’ టీవీ చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నిర్ణయం, విక్టరీ సింబల్ చూపించిన నేతలు
ఈ సమావేశంలొ కూటమిలోని అన్ని పార్టీలు ఇవాళ సాయంత్రం టీవీల్లో ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చల్లో పాల్గొనాలని నేతలు నిర్ణయించారు. సమావేశం ముగిసిన అనంతరం కూటమి నేతలు బయటికి వచ్చి విక్టరీ సింబల్ చూపించారు
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలొ కూటమిలోని అన్ని పార్టీలు ఇవాళ సాయంత్రం టీవీల్లో ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చల్లో పాల్గొనాలని నేతలు నిర్ణయించారు. సమావేశం ముగిసిన అనంతరం కూటమి నేతలు బయటికి వచ్చి విక్టరీ సింబల్ చూపించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సమాజ్‌వాది పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌పవార్, ఆ పార్టీ ముఖ్య నాయకుడు జితేంద్ర అవహాద్, ఆప్ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ ముఖ్య నాయకులు భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) నేత టీఆర్ బాలు హాజరయ్యారు.
వారితోపాటు ఆర్జేడీ (RJD) నేతలు తేజస్వియాదవ్, సంజయ్ యాదవ్, జేఎంఎం (JMM) నేతలు చంపాయ్ సోరెన్, కల్పనా సోరెన్, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి డీ రాజా, సీపీఎం (CPM) జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి, ఉద్ధవ్ బాల్ థాకరే (UBT) శివసేన నాయకుడు అనిల్ దేశాయ్, సీపీఐ ఎంఎల్ (CPI (ML)) పార్టీ నేత దీపాంకర్ భట్టాచార్య తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Here's ANI News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)