Democratic Azad Party: డెమోక్రటిక్ ఆజాద్ పార్టీని స్థాపించిన గులాం నబీ ఆజాద్, మూడు రంగులతో కూడిన జెండాను ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి

Ghulam Nabi Azad (Photo-ANI)

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన గులాం నబీ ఆజాద్ తాజాగా సొంత పార్టీని స్థాపించారు. తన రాజకీయ పార్టీ పేరును ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’గా (ghulam nabi azad new party name) గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. మూడు రంగులతో కూడిన జెండాను ఆవిష్కరించారు. మూడు రంగులు నిలువుగా ఉన్న ఆ జెండాలో మొదటి రంగు నీలం. మధ్యలో తెలుపు రంగు. మూడో రంగు పసుపు. తన పార్టీ జెండాను అలా డిజైన్ చేయడానికి కారణాన్ని కూడా గులాం నబీ ఆజాద్ వివరించారు. పసుపు రంగు కొత్తదనానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని.. తెలుపు శాంతికి చిహ్నమని, నీలం స్వేచ్ఛకు.. సంద్రంలోని లోతుకు.. అందనంత ఎత్తులో ఉండే ఆకాశ వర్ణానికి చిహ్నమని ఆయన చెప్పుకొచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now