Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో 224 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది, కింగ్ మేకర్‌గా జేడీఎస్‌కు ఈ సారి అవకాశం ఇవ్వమని తెలిపిన డీకే శివకుమార్
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకుగాను మూడింట రెండొంతుల సీట్లు తమకే వస్తాయని చెప్పారు.ఈసారి తాము ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోదల్చుకోలేదని తెలిపారు.
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar)కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకుగాను మూడింట రెండొంతుల సీట్లు తమకే వస్తాయని చెప్పారు.ఈసారి తాము ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోదల్చుకోలేదని తెలిపారు. ఎప్పుడూ కింగ్ మేకర్‌గా జేడీఎస్‌కు ఈసారి ఆ అవకాశం ఉండదని చెప్పారు.
ఎందుకంటే ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను మించి తాము ఘన విజయం సాధించబోతున్నామన్నారు. కన్నడ ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారని, అందుకే ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో మే 10న పోలింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Here's ANI UPdate
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)