JDS Joins BJP-led NDA: కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలిపిన జేపీ నడ్డా, సీట్ల పంపకాలపై ఇంకా రాని స్పష్టత
ఈమేరకు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఎన్డీయేలో చేరుతున్నట్లు స్పష్టం చేసింది.
కర్ణాటకలో వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈమేరకు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఎన్డీయేలో చేరుతున్నట్లు స్పష్టం చేసింది.జేడీఎస్ చీఫ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
కాగా జేడీఎస్‌కు నాలుగు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. సీట్ల పంపకాలపై స్పష్టత రావాల్సి ఉంది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఇరుపార్టీల నేతలు ఫొటోలు షేర్ చేస్తూ ఈ మేరకు తెలిపారు.ఎన్డీయే, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలపడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎన్డీయేలో చేరినందుకు జేడీఎస్‌కు అభినందనలు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయేకి మరింత బలం చేకూర్చినట్లయింది' అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఎక్స్ వేదికగా తెలిపారు.
Here's Jagat Prakash Nadda Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)