Lok Sabha Elections 2024: యూపీలో స‌మాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన పొత్తు, 17 సీట్లలో కాంగ్రెస్ పోటీ, మిగతా 63 సీట్లలో కూటమి అభ్యర్థులు పోటీ

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఉత్తర ప్రదేశ్ లో స‌మాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య పొత్తు ఖ‌రారైంది. ఇండియా విప‌క్ష కూట‌మిలో భాగంగా ఇరు పార్టీలు ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీచేస్తాయ‌ని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. పొత్తులో భాగంగా యూపీలో 17 ఎంపీ సీట్ల‌ను కాంగ్రెస్‌కు కేటాయించేందుకు అఖిలేష్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు.

Samajwadi Party chief Akhilesh Yadav (File Image)

వచ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఉత్తర ప్రదేశ్ లో స‌మాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య పొత్తు ఖ‌రారైంది. ఇండియా విప‌క్ష కూట‌మిలో భాగంగా ఇరు పార్టీలు ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీచేస్తాయ‌ని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. పొత్తులో భాగంగా యూపీలో 17 ఎంపీ సీట్ల‌ను కాంగ్రెస్‌కు కేటాయించేందుకు అఖిలేష్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. మిగిలిన 67 సీట్లలో ఇండియా కూటమి అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కాగా ఇరు పార్టీల మ‌ధ్య పొత్తుకు కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ కీల‌క పాత్ర పోషించారు. కాంగ్రెస్‌, ఎస్పీ మ‌ధ్య పొత్తు ఖ‌రారు కావ‌డంతో రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో అఖిలేష్ యాద‌వ్ పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement