MK Stalin Takes Oath as CM: 'స్టాలిన్ అనే నేను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను' తమిళనాడు 14వ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన డీఎంకే అధినేత ఎం.కే స్టాలిన్

MK Stalin Takes Oath as CM of TN | Photo: ANI

తమిళనాడు 14వ సీఎంగా డీఎంకే అధినేత ఎం.కే స్టాలిన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్ భవన్ లో గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ ఆయనే ప్రమాణ స్వీకారం చేయించారు. కోవిడ్ దృష్ట్యా ఈ వేడుక నిరాడంబరంగా నిర్వహించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గానూ డీఎంకేకు 133 సీట్లు మెజారిటీ లభించగా, అన్నాడీఎంకే 66, కాంగ్రెస్ 18, పీఎంకే 5, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement