News18 Mega Opinion Poll: మళ్లీ మోదీకే పట్టం కట్టనున్న ఓటర్లు, న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైన సంచలన విషయాలు ఇవిగో..

న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వేలో ఓటర్లు మళ్లీ బీజేపీకే పట్టం కట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఓటు వేస్తామని దేశంలో 85 శాతం మంది అభిప్రాయపడినట్లు ఈ సర్వేలో వెల్లడయింది.

Rahul Gandhi and PM Modi (Photo-ANI)

న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వేలో ఓటర్లు మళ్లీ బీజేపీకే పట్టం కట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఓటు వేస్తామని దేశంలో 85 శాతం మంది అభిప్రాయపడినట్లు ఈ సర్వేలో వెల్లడయింది. తదుపరి ప్రధానిగా ఎవరు బెస్ట్ అని ప్రశ్నకు 59 శాతం మంది నరేంద్ర మోదీ పేరును సూచించగా, 21 శాతం మంది రాహుల్ గాంధీకి, 9 శాతం మంది మమతా బెనర్జీకి, 9 శాతం మంది అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటు వేశారు.  బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన నాయాబ్ సింగ్ సైనీ, మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస పరీక్షలో నెగ్గిన హర్యానా కొత్త ముఖ్యమంత్రి

నిజాయితీపరుడు ఎవరన్న ప్రశ్నకు 73 శాతం మంది మోదీని, 27 శాతం మంది రాహుల్ గాంధీ పేరును పేర్కొన్నారు. భారత భవిష్యత్తుపై సరైన ఆలోచన ఉన్న నేతగా మోదీకి 68 శాతం మంది ఓటు వేస్తే, రాహుల్ గాంధీకి 32 శాతం మంది ఓటేశారు.21 రాష్ట్రాల్లోని 518 లోక్ సభ నియోజకవర్గాల్లో న్యూస్18 నెట్‌వర్క్ తన మెగా ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ పోల్ కోసం 1,18,616కు పైగా శాంపిల్స్ సేకరించారు. దాదాపు 95 శాతం లోక్ సభ నియోజకవర్గాలను కవర్ చేశారు. ఇది దేశంలోని అతిపెద్ద సర్వేలలో ఒకటిగా ఉంది.

Here's Poll survey Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now