Parliament Winter Session: లోక్ సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్, ఉభయ సభల్లో 141కి చేరిన సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య
దుండగుల చొరబాటు అంశంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభల్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లోక్ సభలో గందరగోళం మధ్యనే సాగుతున్నాయి. దుండగుల చొరబాటు అంశంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభల్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. తాజాగా లోక్ సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు.
వీరిలో ఫరూక్ అబ్దుల్లా, శశిథరూర్, ఫైజల్, కార్తీ చిదంబరం, సుప్రియా సూలే, మనీశ్ తివారీ, డింపుల్ యాదవ్ తదితరులు ఉన్నారు. తాజా సస్పెన్షన్లతో కలిపి ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య (ఉభయ సభలు) 141కి చేరుకుంది. లోక్ సభలో 95 మంది, రాజ్యసభలో 46 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. వీరందరినీ ఈ సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేశారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)