Presidential Elections 2022: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా, కార్యక్రమానికి హాజరయిన పలు పార్టీల నేతలు
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన నామినేషన్‌ను సోమవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. అయితే నామినేషన్ దాఖలు సమయంలో కేటీఆర్ ముందు వరుసలో కూర్చున్నారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన నామినేషన్‌ను సోమవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అయితే నామినేషన్ దాఖలు సమయంలో కేటీఆర్ ముందు వరుసలో కూర్చున్నారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, కేటీఆర్, ఏ రాజా, సీతారాం ఏచూరి ముందు వరుసలో ఆశీనులై.. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తమ మద్దతును తెలిపారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరపున తనతో పాటు తమ ఎంపీలు హాజరవుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)