Tamil Nadu Elections 2024: తమిళనాడులో బీజేపీకి బిగ్ బూస్టింగ్, కాషాయం తీర్థం పుచ్చుకున్న 15 మంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరో మాజీ ఎంపీ
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె)కు చెందిన పదిహేను మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బుధవారం బీజేపీ పార్టీలో చేరారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె)కు చెందిన పదిహేను మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బుధవారం బీజేపీ పార్టీలో చేరారు. కేంద్రమంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, ఎల్ మురుగన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో ఢిల్లీలో వారు బీజేపీలో చేరారు.
అనంతరం విలేకరు సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని... ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు తమతో కలిసారని అన్నారు. తమిళనాడు ప్రజలు ఈ సారి బీజేపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లకు పైగా వస్తాయని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఎంపీ సీట్లు గెలుచుకుంటామని జోస్యం చెప్పారు. గత పదేళ్లుగా జరుగుతోన్న అభివృద్ధి కొనసాగాలని దేశంలోని ప్రతి పౌరుడు భావిస్తున్నాడన్నారు.
Here's PTI News