Anand Mahindra Tweet: నేను, నా కంపెనీ ఇంకా అలా ఎదగలేదురా బాబు, వైరల్ వీడియో ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా, ట్రక్ డిజైనింగ్‌లో ఇది భాగం కాదని విష్యత్‌లోనూ దీన్నెప్పటికీ భాగం చేయమంటూ స్పష్టత

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోతో షేర్‌ చేయడంతో పాటు ‘‘నేను, నా కంపెనీ ఇంకా ఇంత ఎదగలేదురా బాబు.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులు చేయనని ఆనంద్‌ మహీంద్రా అంటున్నారు. ట్వీట్టర్లో షేర్ చేసిన వీడియోలో (Anand Mahindra Tweet) ముందు ఓ పికప్‌ ట్రక్కు కనిపిస్తుంది. పోలీసులు ట్రక్కు కింద భాగంలో అమర్చిన డ్రాను బయటకు లాగారు. బయటకు కనిపించకుండా అమర్చిన డ్రాలో (Video of Secret Liquor Drawer) వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు, కార్టన్లు దర్శనమిచ్చాయి. ఈ వీడియో చూసిన వారంతా వీరి అతి తెలివికి కళ్లు తేలేస్తారు.

Mahindra Group Chairman Anand Mahindra offers internship to a millionaire’s son (Photo-Twitter)

దీనిపై ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) స్పందిస్తూ.. తమ పికప్‌ ట్రక్ డిజైనింగ్‌లో ఇది భాగం కాదని.. భవిష్యత్‌లోనూ దీన్నెప్పటికీ భాగం చేయమంటూ స్పష్టత ఇచ్చారు. ‘ తెలివైనవాడు. సరుకు రవాణాకు కొత్త అర్థం ఇచ్చాడు! మా పరిశోధనా కేంద్రంలో పికప్‌ ట్రక్ డిజైనింగ్ మార్పుల్లో ఈ ఆలోచనకు తావు లేదు. ఎప్పటికీ ఉండదు’ అంటూ దాన్ని ఉపయోగించిన తీరును మహీంద్రా వ్యతిరేకించారు.

Here's anand mahindra Share Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now