Gandhi Jayanti 2021 Wishes: మహాత్మా గాంధీ 152వ జయంతి, ఘనంగా నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తదితరులు

గాంధీ జయంతి, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి 117వ జ‌యంతి ని పురస్కరించుకొని దేశ నేతలు, ప్రముఖులు వారికి సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

PM Narendra Modi at Vijay Ghat. (Photo Credits: ANI)

Gandhi Jayanti 2021: నేడు జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి. అహింసే ఆయుధంగా దేశం కోసం, ధర్మం కోసం శాంతి కోసం పోరాడిన బాపూజీ జీవన మార్గం ప్రతీ భారతీయుడికి అనుసరణీయం. స్వాతంత్య్ర సమరయోధుడిగా, అహింసా వాదిగా యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిత్వం, ఉద్యమ కార్యాచరణ మనందరికి స్ఫూర్తిదాయకం. గాంధీ జయంతి, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి 117వ జ‌యంతి ని పురస్కరించుకొని దేశ నేతలు, ప్రముఖులు వారికి సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాత్ముడికి ఘన నివాళులు అర్పించారు. బాపు జీవితం, ఆదర్శాలు దేశంలోని ప్రతి తరానికి మంచి మార్గంలో నడవడానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని కొనియాడారు. ఆయనతోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోమంత్రి అమిత్‌ షా గాంధీజీకి నివాళులు అర్పించారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement