Sri Ram Navami 2024: వీడియోలు ఇవిగో, భద్రాచలంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం, ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధానఘట్టం ఆవిష్కృతం కానున్నది. శ్రీ రామనామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధానఘట్టం ఆవిష్కృతం కానున్నది. శ్రీ రామనామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి.ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు.
మిథిలా మైదానంలో వైభవోపేతంగా సాగుతున్న సీతారాముల కల్యాణం.. మిథిలా మండపంలో సీతారాముల కోసం కల్యాణ మండపం ముస్తాబైంది. ప్రభుత్వం తరఫున స్వామివారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.ముత్యాల తంబ్రాలను సైతం సమర్పించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు స్వామివారి కల్యాణ క్రతువు సాగనున్నది. అభిజిత్ లగ్నంలో జరగనున్న సీతారాముల కల్యాణం జరుగనున్నది.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)