CM KCR Sri Rama Navami Wishes: రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆన్‌లైన్ ప్రసారాల ద్వారా వీక్షించాలని సూచన
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతి ఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావంతో ఈసారి సామూహికంగా జరుపుకోలేకపోతున్నామని అన్నారు.
అందువల్ల భద్రాద్రి ఆలయంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆన్‌లైన్ ప్రసారాల ద్వారా వీక్షించాలని ప్రజలకు సూచించారు. లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని అన్నారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని శ్రీసీతారాములను సీఎం ప్రార్థించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement