Khairatabad Ganesh Idol's Poster: ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుని రూపం ఇదే, పంచముఖ లక్ష్మీగణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న గణేశుడు

ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆవిష్కరించారు. 50 అడుగుల భారీ మట్టి విగ్రహ రూపాన్ని ఈ ఏడాది ఆవిష్కరించారు. తొలిసారి మట్టితో ఖైరతాబాద్‌ మహా గణపతిని తయారు చేయనున్నారు.

Khairatabad Ganesh 2022 idol's poster unveiled (Photo-Twitter)

ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆవిష్కరించారు. 50 అడుగుల భారీ మట్టి విగ్రహ రూపాన్ని ఈ ఏడాది ఆవిష్కరించారు. తొలిసారి మట్టితో ఖైరతాబాద్‌ మహా గణపతిని తయారు చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ భారీ గణేశుడు పంచముఖ లక్ష్మీగణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణనాథునికి ఎడమ వైపు త్రిశక్తి మహాగాయత్రి దేవి, కుడి వైపు సుబ్రమణ్యస్వామి ప్రతిమ ఉండనుంది. నిమజ్జనానికి తరలివెళ్లేలా మట్టి విగ్రహాన్ని తయారు చేయనున్నారు. 9 రోజుల పాటు పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించే విధంగా విగ్రహాన్ని రూపొందిస్తామని ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement