Maintenance to ill Husband: ఎప్పుడూ భర్తే కాదు.. భార్య కూడా భరణం ఇవ్వాల్సిందే.. భర్తకు అనారోగ్య సమస్యలుంటే భార్య భరణం చెల్లించాల్సిందే.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కానీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుద్యోగ భర్తకు ఉద్యోగస్తురాలైన భార్య నెలకు 10 వేల రూపాయలు భరణం చెల్లించాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది.
Newdelhi, Apr 12: సాధారణంగా భరణం కేసుల్లో (Maintenance Cases) భార్యకు భర్త పరిహారం చెల్లించాలంటూ న్యాయస్థానాలు (Courts) తీర్పులు చెబుతుంటాయి. కానీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుద్యోగ భర్తకు ఉద్యోగస్తురాలైన భార్య నెలకు 10 వేల రూపాయలు భరణం చెల్లించాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం‘జీవిత భాగస్వామి’ అన్న పదం అటు భర్తకు, ఇటు భార్యకు కూడా వర్తిస్తుందని న్యాయస్థానం గుర్తుచేసింది.