Vijayawada, Apr 12: ఇంటర్మీడియట్ పరీక్షలు (AP Intermediate Exams) రాసిన విద్యార్థులకు శుభవార్త. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు (AP Intermediate Board) వెల్లడించింది. ఉదయం 11 గంటలకు మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఒకేషనల్, రెగ్యులర్ కలిపి ఫస్టియర్ 5,17,617 మంది విద్యార్థులు, సెకండియర్ 5,35,056 మంది విద్యార్థులు పరీక్షలకు ఫీజులు చెల్లించారు. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in లో చూడొచ్చు.
నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు
ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కానున్న ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు. pic.twitter.com/iOQJl9u0rO
— Telugu Scribe (@TeluguScribe) April 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)