Hyderabad Dating App Scam: ఒకే అమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలు.. లక్షకు పైగా స్కాం..!
కుర్రాళ్లే టార్గెట్‌గా వల వేసి వేల రూపాయలు గుంజేస్తున్నారు కొంతమంది కిలాడీ లేడీలు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకొచ్చింది.
అమ్మాయి అయిమూలగా నవ్వితే చాలు అబ్బాయిలు పడిపోతారని జల్సా సినిమాలో పవన్ కల్యాణ్ ఏ ప్రూఫ్‌తో చెప్పాడో తెలీదు కానీ.. ఈ రోజుల్లో నిజంగా అమ్మాయి నవ్వితే చాలు, నాతో బయటకొస్తే చాలు అన్నట్లు అన్నట్లు తయారైపోయారు కొంతమంది కుర్రాళ్లు. అలాంటి కుర్రాళ్లే టార్గెట్‌గా వల వేసి వేల రూపాయలు గుంజేస్తున్నారు కొంతమంది కిలాడీ లేడీలు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకొచ్చింది. దీపిక నారాయణ్ భరద్వాజ్ అనే యువతి చేసిన ట్విటర్ పోస్ట్ ప్రకారం.. హైదరాబాద్ పరిధిలో ఓ అమ్మాయి ఏకంగా ముగ్గురు అబ్బాయిలని ఇదే తరహాలో మోసం చేసింది. ముందుగా టిండర్, బంబుల్ యాప్స్‌లో పరిచయమై.. ఆ తర్వాత వాళ్లని ఓ క్లబ్‌కు తీసుకెళ్లి అక్కడ రూ.20 నుంచి రూ.30 వేల వరకు బిల్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ బిల్లు చూసి సదరు యువకులు షాకై పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అలాగే తాము మోసపోయామంటూ సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌లు పెడుతున్నారు. రెండు రోజులకే బీహార్‌ని తలపిస్తున్నారు, టీడీపీ దాడులపై మండిపడిన పేర్ని నాని
దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే.. ఆన్‌లైన్‌లో పరిచయం అయిన ప్రతి అమ్మాయిని గుడ్డిగా నమ్మితే మిగిలేది మట్టే. అలాగే అమ్మాయితే పబ్బుకెళ్లాం, క్లబ్బుకెళ్లాం కదా అని అడిగినవన్నీ కొనిపెట్టి గొప్పలకు పోదాం అనుకుంటే జేబుకు చిల్లు పడడం తప్ప ఇంకేం మిగలదు. మరి జాగ్రత్త.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)