Turbulence on Air Europa Flight: ఆకాశంలో భారీ కుదుపులకు లోనైన విమానం, బ్రెజిల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్, పలువురి ప్రయాణికులకు గాయాలు
ఎయిర్ యూరోపా (Air Europa)కు చెందిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న ఎయిర్ యూరోపా (Air Europa)కు చెందిన ఓ విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు (Turbulence) లోనైంది. ఈ ఘటనలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో విమానాన్ని బ్రెజిల్ (Brazil)లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

ఎయిర్ యూరోపా బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం 325 మంది ప్రయాణికులతో సోమవారం స్పెయిన్ (Spain)లోని మాడ్రిడ్ నుంచి ఉరుగ్వే (Uruguay) రాజధాని మాంటెవీడియో (Montevideo)కు బయల్దేరింది.మార్గం మధ్యలో విమానంలో తీవ్రమైన కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు వారి సీట్ల నుంచి కిందపడిపోయారు.అనేక మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో విమానాన్ని ఈశాన్య బ్రెజిల్‌లోని నాటల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.ఈ ఘటనలో గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కరెంట్ తీగలు తగిలి నడిరోడ్డు మీద కూలిన విమానం, ముగ్గురు ప్రయాణికులు మృతి, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్
Here's Videos