Andhra Pradesh Horror: వీడు తమ్ముడేనా, అక్కపై గొడ్డలితోదారుణంగా ఎలా దాడి చేస్తున్నాడో చూడండి, ఆస్తి వివాదాలే కారణం, వీడియో ఇదిగో..
ఇంటి స్థల వివాదంలో సొంత అక్క, ఆమె కుమార్తైపె ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం పెనకచెర్ల డ్యాం గ్రామంలో నివాస ముంటున్న షేక్ జిలాన్ బాషాకు కొంతకాలంగా కుటుంబసభ్యులతో ఆస్తి వివాదం నడుస్తోంది.
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటి స్థల వివాదంలో సొంత అక్క, ఆమె కుమార్తైపె ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం పెనకచెర్ల డ్యాం గ్రామంలో నివాస ముంటున్న షేక్ జిలాన్ బాషాకు కొంతకాలంగా కుటుంబసభ్యులతో ఆస్తి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంటి వద్ద స్థలం విషయమై అక్క మహబూబ్‌బీతో జిలాన్‌బాషా ఘర్షణ పడ్డాడు. వీడియో ఇదిగో, అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య, 10 నుండి 20 రూపాయల వడ్డీకి తెచ్చి స్టాక్ మార్కెట్లలో పెట్టి నష్టపోయిన యువకుడు
ఆ సమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన జిలాన్ గొడ్డలితో అక్కపై దాడి చేశాడు. అక్కడే ఉన్న మహబూబ్‌బీ కుమార్తె షకూన్‌బీ అడ్డుకోబోయింది. దీంతో ఆమైపె కూడా గొడ్డలితో దాడి చేశాడు. చుట్టుపక్కల వారు అడ్డుకుని క్షతగాత్రులను వెంటనే అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాసలాన్ని సందర్శించి, బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన జిలాన్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)