Bengaluru Rave Party Case: ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమే, తాజాగా డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌తో వీడియోని విడుదల చేసిన నటి హేమ
తాను బహిరంగంగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసమే ఈ వీడియో చేశానని చెప్పింది. అలానే తాను చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌ని వీడియోలో షేర్ చేసింది.
గతంలో బెంగళూరు రేవ్ పార్టీలో హేమ, పోలీసులకు పట్టుబడటం చర్చనీయాంశమైన సంగతి విదితమే. తాజాగా హేమ ఓ వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.బెంగళూరు రేవ్ పార్టీ విషయమై మాట్లాడుతూ.. తాను బహిరంగంగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవడానికైనా సిద్ధమని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోసమే ఈ వీడియో చేశానని చెప్పింది. అలానే తాను చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్‌ని వీడియోలో షేర్ చేసింది. కల్కిలో ప్రభాస్ జోకర్ లా కనిపించడంతో బాధగా అనిపించింది,బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సంచలన వ్యాఖ్యలు
బెంగళూరులోని రేవ్ పార్టీలో దాదాపు 86 మంది ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు. ఇందులో హేమ కూడా ఒకరని చెప్పిన పోలీసులు.. రెండుసార్లు నోటీసులు పంపించారు. ఎంతకీ రాకపోవడంతో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్‌పై బయటకొచ్చింది
Here's Video