Bengaluru's Pizza Hero: ఇదేందయ్యా.. ఇది! ట్రాఫిక్ లో ఇరుక్కున్న కారు.. ఆకలిగా ఉందని పిజ్జా ఆర్డర్.. కారు దగ్గరికే డెలివరీ.. బెంగళూరులో సూపర్ వైరల్ వీడియో ఇదిగో

మామూలు రోజుల్లోనే బెంగళూరు ట్రాఫిక్‌ ప్రజలకు చుక్కలు చూపెడుతుంది. దానికి తోడు కావేరి జలాల వివాదంలో బంద్‌ కు పిలుపునివ్వడంతో గురువారం నగరవాసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుని నరకమే చూశారు.

Bengaluru's Pizza Hero (Credits: X)

Bengaluru, Sep 29: మామూలు రోజుల్లోనే బెంగళూరు ట్రాఫిక్‌ (Bengaluru Traffic) ప్రజలకు చుక్కలు చూపెడుతుంది. దానికి తోడు కావేరి జలాల వివాదంలో బంద్‌ (Bandh) కు పిలుపునివ్వడంతో గురువారం నగరవాసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుని నరకమే చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో కారులో ప్రయాణిస్తూ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పై గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌లో (Traffic) చిక్కుకున్న కొందరు ఆకలిగా ఉందని పిజ్జాకు ఆర్డర్‌ ఇవ్వడం, దానిని ఆన్‌ టైమ్‌ లోనే డెలివరీ బాయ్‌ ట్రాఫిక్‌ లో ఇరుక్కుని ఉన్న కారు వద్దకే వచ్చి డెలివరీ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. మా కారు లైవ్‌ లొకేషన్‌ ఆధారంగా పిజ్జా డెలివరీ చేసిన డోమినోస్‌ వారికి కృతజ్ఞతలు చెబుతున్నానంటూ రిషీవత్‌ పేరిట ఎక్స్‌ లో పోస్టు చేశారు.

ISRO Pragyan Rover: ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. మేల్కొనకపోయినా ఇబ్బందేమీ లేదన్న ఇస్రో చీఫ్ సోమనాథ్.. రోవర్ తన లక్ష్యాన్ని చేరుకుందని వ్యాఖ్య

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement