Bihar: దారుణం, జై శ్రీరామ్ నినాదాలు చేయాలంటూ మదర్సా విద్యార్థులపై దాష్టికం, కేసు నమోదు చేసిన పోలీసులు
బంకా జిల్లాలోని బరాహత్ బ్లాక్‌లోని మదర్సా విద్యార్థులను "జై శ్రీ రామ్" అని నినాదం (Madrasa Students Forced To Chant ‘Jai Shri Ram’ ) చేయాలంటూ బలవంతం చేయడాన్ని చూపిస్తూ ఆందోళన కలిగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఈ సంఘటనను ట్విటర్‌లో పంచుకున్నారు, బీహార్ పోలీసులు, బంకా పోలీసులను ట్యాగ్ చేస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలనినెటిజన్లు కోరారు. బంకా పోలీసులు సత్వరమే స్పందించి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించినట్లు ధృవీకరించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న వ్యక్తులను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నట్లు కూడా వారు తెలిపారు. "వీడియోలో ఉన్న వ్యక్తులను గుర్తిస్తున్నాము. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము" అని బంకా పోలీసుల నుండి ఒక ట్వీట్ తెలిపింది. నగరిలో దారుణం.. మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, నిందితుడిపై పోక్సో కేసు నమోదు
మదర్సా విద్యార్థులను 'జై శ్రీరాం' అంటూ బలవంతంగా నినాదాలు చేశారు.