Bihar: వృద్ధుడైన ఇంగ్లీష్ టీచర్‌ని విచక్షణారహితంగా కొట్టిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, సోషల్ మీడియాలో వీడియో వైరల్, కానిస్టేబుళ్లను 3 నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసిన అధికారులు

బిహార్‌లోని కైమూర్‌లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఒక వృద్ధ టీచర్‌ని విచక్షణారహితంగా కొట్టారు. వృద్ధ టీచర్‌ నావల్‌ కిషోర్‌ పాండే డీపీఎస్‌ పాఠశాలలో ఇంగ్లిషు బోధిస్తున్నాడు. జయప్రకాష్‌ చౌక్‌లోని పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో దీన్ని పట్టించుకోకుండా కిషోర్‌ రోడ్డు దాటుతున్నాడు

police women brutally beat elderly school teacher (Photo-Video Grab)

బిహార్‌లోని కైమూర్‌లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఒక వృద్ధ టీచర్‌ని విచక్షణారహితంగా కొట్టారు. వృద్ధ టీచర్‌ నావల్‌ కిషోర్‌ పాండే డీపీఎస్‌ పాఠశాలలో ఇంగ్లిషు బోధిస్తున్నాడు. జయప్రకాష్‌ చౌక్‌లోని పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో దీన్ని పట్టించుకోకుండా కిషోర్‌ రోడ్డు దాటుతున్నాడు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు ఆయనను ఆపే ప్రయత్నం చేసినా అతడు వీరిని పట్టించుకోలేదు. ఆగ్రహానికి గురైన కానిస్టేబుళ్లు వృద్ధుడిని రోడ్డు మీద ఆపి కొట్టడం ప్రారంభించారు. దీనిని గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం వల్ల అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పోలీసు అధికారులు కానిస్టేబుళ్లను 3 నెలల పాటు విధుల నుంచి తప్పించారు.

ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ కూడా పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను ట్యాగ్ చేస్తూ వీడియోను ట్వీట్ చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now