Chhatrapati Shivaji Maharaj Statue: వీడియో ఇదిగో, మహారాష్ట్రలో కూలిపోయిన భారీ శివాజీ విగ్రహం, మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు
2023, DEC 4న ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం షిండే దీన్ని ప్రారంభించారు. విగ్రహం ప్రారంభించిన 9 నెలలకే కూలిపోవడం గమనార్హం.
మహారాష్ట్ర - మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోటలో గతేడాది ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలింది. 2023, DEC 4న ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం షిండే దీన్ని ప్రారంభించారు. విగ్రహం ప్రారంభించిన 9 నెలలకే కూలిపోవడం గమనార్హం. భారీ వర్షాల కారణంగా విగ్రహం కూలినట్టు సమాచారం. సింధుదుర్గ్ జిల్లా మాల్వాన్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఏలియన్స్ గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు, వాటి పరిచయం చాలా ప్రమాదకరం అంటూ...
ఘటనపై మాజీ ఎంపీ శంభాజీరాజే ఛత్రపతి, ప్రతిపక్ష నేత జితేంద్ర అవద్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శంభాజీ రాజే ట్వీట్ చేస్తూ విమర్శలకు దిగారు. ప్రధాని ప్రారంభించేందుకు హడావుడిగా ఏర్పాటు చేసిన విగ్రహం కూలిపోయిందని అన్నారు. స్మారక చిహ్నాన్ని నిర్వహించడంలో బిజెపి నిర్లక్ష్యంగా ఉందని కాంగ్రెస్ మరియు NCP (SP) ఆరోపించింది. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను అవమానించడమేనని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని సుప్రియా సూలే పిలుపునిచ్చారు.
Here's News
Here's Sambhaji Chhatrapati Tweet
Dr.Jitendra Awhad Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)