City of The Monkeys: అమెరికాలో కోతుల కోసం మినీ సిటీ.. 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు.. ఎందుకో తెలుసా?

కోతుల కోసం ఓ మినీ సిటీని నిర్మిస్తామని అందులో 30 వేల కోతుల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సేఫర్‌ హ్యూమన్‌ మెడిసిన్‌ అనే కంపెనీ ప్రకటించింది. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, వీటిని వైద్య రంగంలో పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలు, ఫార్మాస్యుటికల్‌ కంపెనీలకు పంపిస్తామని ఈ కంపెనీ చెప్తున్నది.

City of The Monkeys (Credits: X)

Newyork, Feb 20: కోతుల (Monkeys) కోసం ఓ మినీ సిటీని (Mini City) నిర్మిస్తామని అందులో 30 వేల కోతుల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సేఫర్‌ హ్యూమన్‌ మెడిసిన్‌ అనే కంపెనీ ప్రకటించింది. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, వీటిని వైద్య రంగంలో పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలు, ఫార్మాస్యుటికల్‌ కంపెనీలకు పంపిస్తామని ఈ కంపెనీ చెప్తున్నది. కంపెనీ ప్రకటనపై అమెరికాలోని జార్జియా స్టేట్‌, బెయిన్‌ బ్రిడ్జ్‌ పట్టణవాసులు, జంతు హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. దాదాపు 14,000 జనాభాగల ఈ పట్టణంలో, 30,000 కోతులు ఉండటాన్ని తాము అంగీకరించబోమని, ఈ కంపెనీని తక్షణమే నిలిపేయాలని అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.

Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. పంటి చికిత్సకు వెళ్తే ఏకంగా ప్రాణం పోయింది.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడి ఇంట్లో విషాదం.. డెంటల్‌ దవాఖాన నిర్వాహకులపై కేసు.. అసలేం జరిగింది??

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement