DigiYatra At Vijayawada and Hyderabad Airports: విజయవాడ, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లలో త్వరలో డిజీ యాత్ర సేవలు.. తగ్గనున్న వేచి చూసే సమయం.. ఎలా అంటే?

వచ్చే నెలలోగా హైదరాబాద్, విజయవాడతో పాటు కోల్ కతా, పుణె విమానాశ్రయాల్లో డిజీ యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర వైమానిక శాఖ తెలిపింది. ప్రయాణికుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి డిజీ యాత్ర సేవలను తీసుకొచ్చింది.

Hyderabad, Feb 3: వచ్చే నెలలోగా హైదరాబాద్ (Hyderabad), విజయవాడతో (Vijayawada) పాటు కోల్ కతా (Kolkata), పుణె (Pune) విమానాశ్రయాల్లో డిజీ యాత్ర (DigiYatra) సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర వైమానిక శాఖ తెలిపింది. ప్రయాణికుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో ఇటీవల పలు విమానాశ్రయాల్లో చెక్ ఇన్  కోసం వందలాది మంది గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. దీంతో కేంద్రం ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి డిజీ యాత్ర సేవలను తీసుకొచ్చింది. ప్రయాణికుల స్మార్ట్ ఫోన్ లోనే వారి వివరాలు, ప్రయాణ డీటేయిల్స్ తదితరాలను పర్సనల్లీ ఐడెంటిఫేబుల్ ఇన్ఫర్మేషన్ (పీఐఐ) గా నమోదు చేస్తారు. దీనికోసం డిజీ యాత్ర పేరిట ఓ ఐడీ పంపుతారు. 24 గంటలపాటు అందుబాటులో ఉండే ఈ డీజీ సమాచారంతో ఎలాంటి ఆలస్యం లేకుండా ఎయిర్ పోర్టుల్లో చెక్-ఇన్ పూర్తి చేసుకోవచ్చు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement