Dog at Jodhpur: పైశాచికత్వానికి పరాకాష్ఠ .. మూగ జీవం అని కూడా చూడకుండా కారుకు కుక్కను కట్టి పరిగెత్తించిన డాక్టర్.. వీడియో ఇదిగో

కారుకు కుక్కను కట్టి పరిగెత్తించిన డాక్టర్.. డాక్టర్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. శునకం కాళ్లకు ఫ్యాక్చర్లు.. డాక్టర్‌పై జంతు హింస చట్టం కింద కేసు నమోదు

Dog (Photo Credits: Twitter)

Jodhpur, September 19: మనుషులకు ప్రాణాలు పోసే ఓ డాక్టరే (Doctor) పైశాచికంగా ప్రవర్తించాడు. కుక్క మెడకు తాడు కట్టి ఆపై కారు (Car)ను వేగంగా పోనిచ్చాడు. దీంతో మరోమార్గం లేని శునకం దాని వెనక పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ (Jodhpur)లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. డాగ్ హోం ఫౌండేషన్ అనే ఎన్‌జీవో ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. శునకాన్ని కారుతో ఈడ్చుకెళ్లిన ఆ డాక్టర్ పేరును రజనీష్ గల్వాగా పేర్కొంది.

కోహ్లీ, పాండ్యా ‘షకబూమ్’ డ్యాన్స్ చూశారా.. వీడియో ఇదిగో!

ఆ వీధికుక్క నిత్యం తన ఇంటి వద్దే కాపుకాస్తుండడంతో దానిని వదిలించుకోవడానికే ఇలా చేసినట్టు రజనీష్ పేర్కొన్నాడు. కాగా, శునకం కాళ్లకు పలుచోట్ల ఫ్రాక్చర్ అయినట్టు ఎన్‌జీవో పేర్కొంది. జోధ్‌పూర్ పోలీస్ కమిషనర్ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, అతడి లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థను, మేనకాగాంధీని ట్యాగ్ చేసింది. ఆ తర్వాత డాక్టర్‌పై జంతు హింస చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని కూడా షేర్ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)