Shakaboom Dance: కోహ్లీ, పాండ్యా ‘షకబూమ్’ డ్యాన్స్ చూశారా.. వీడియో ఇదిగో!

టిక్ టాక్ వైరల్ వీడియోకు స్టెప్పులు వేసిన క్రికెటర్లు.. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో పోస్ట్ చేసిన హార్దిక్.. ఇద్దరి సరదా స్టెప్పులు చూసి నవ్వుకుంటున్న ఫ్యాన్స్

Shakaboom Dance: కోహ్లీ, పాండ్యా ‘షకబూమ్’ డ్యాన్స్ చూశారా.. వీడియో ఇదిగో!
Kohli, Pandya Dance (Photo Credits: Twitter)

NewDelhi, September 19: టీమిండియా క్రికెటర్లు (Team India) విరాట్ కోహ్లీ (Virat Kohli), హార్దిక్ పాండ్యా (Hardik pandya) అద్భుతమైన ఆటగాళ్లే కాదు మంచి స్నేహితులు కూడా. మైదానంలో కలిసికట్టుగా ఆడుతూ జట్టును గెలిపించే వీళ్లు బయట చాలా సరదాగా ఉంటారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ రీల్ సోషల్ మీడియాలో (Social Media) హల్ చేస్తోంది. టిక్ టాక్ లో వైరల్ అవుతున్న ‘షకబూమ్’ పాటకు ఈ ఇద్దరూ కలిసి కాళ్లు కదిపారు.

బౌలర్ చింతన్ గజా త్రో.. టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌‌కు తప్పిన పెను ప్రమాదం

షార్ట్స్ ధరించిన పాండ్యా, కోహ్లీ నల్ల కళ్లజోడు పెట్టుకొని కో ఆర్టినేషన్ తో  స్టెప్పులు వేశారు. ఈ వీడియోను హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అంతే.. క్షణాల్లో వైరల్ అయ్యింది. కోహ్లీ, పాండ్యా ఫన్నీ స్టెప్పులు నవ్వులు పూయిస్తోంది.

(The above story first appeared on LatestLY on Sep 19, 2022 10:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).