Elon Musk On Indian Food: భారతీయ వంటకాలు సూపర్ అంటున్న ఎలాన్ మస్క్, ఇండియా వచ్చి ఇక్కడి వంటకాలను రుచి చూడండి అంటున్న నెటిజన్లు

టెస్లా (Tesla) అధినేత, ట్విట్టర్‌ సీఈవో (Twitter CEO) ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) భారతీయ వంటకాలకు ఫిదా అయ్యారు. డేనిఎల్‌ (Daniel) అనే ఓ ట్విట్టర్‌ యూజర్‌ భారతీయ వంటకాల గురించి ఓ పెస్టు పెట్టారు.

Elon musk (Photo-ANI)

టెస్లా (Tesla) అధినేత, ట్విట్టర్‌ సీఈవో (Twitter CEO) ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) భారతీయ వంటకాలకు ఫిదా అయ్యారు. డేనిఎల్‌ (Daniel) అనే ఓ ట్విట్టర్‌ యూజర్‌ భారతీయ వంటకాలు.. నోరూరించే బటర్‌ చికెన్‌, నాన్‌ రోటీ, అన్నం ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ భారతీయ వంటకాలను తానెంతో ఇష్టపడతానని పేర్కొన్నాడు. దీనిపై మస్క్‌ కూడా స్పందించాడు. ‘నిజమే’ అన్న ఒక్క పదంతో ఇండియన్‌ ఫుడ్‌ (Indian Food)పై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించారు.ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మస్క్‌ భారత్‌ వచ్చి ఇక్కడి వంటకాలను రుచి చూడండి’, ‘భారత్‌ పర్యటనకు సిద్ధం కండి’, ‘28 రాష్ట్రాలు.. 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో వివిధ రకాల వంటకాలను ఎప్పుడు టేస్ట్‌ చేస్తారు..?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement